అమెరికాలో మళ్లీ కరోనా కల్లోలం.. వారానికి సగటున 350 వరకు కొవిడ్ మరణాలు నమోదు!
Wed May 28, 2025 12:32 U S A
అమెరికాలో కొవిడ్-19 వైరస్ విజృంభిస్తున్నది. వందల్లో మరణాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు వంటి హైరిస్క్ గ్రూప్ వారికి కరోనా ప్రాణ సంకటంగా మారిందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో గత నెల రోజుల్లో సగటున వారానికి 350 వరకు కరోనా మరణాలు నమోదైనట్టు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) గణాంకాలు చెప్తున్నాయి. ఇవి మరింత పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికం ఎన్బీ.1.8.1 వేరియంట్వే అని సీడీసీ తెలిపింది. చైనాలో మళ్లీ కొవిడ్ కేసులు పెరగడానికి, ఇతర ఆసియా దేశాల్లో కేసులు నమోదు కావడానికి ఈ వేరియంటే కారణం. కొత్త వేరియంట్ కేసులు అమెరికాలోని వాషింగ్టన్, కాలిఫోర్నియా, న్యూయార్క్ సిటీ, వర్జీనియా తదితర రాష్ట్రాల్లో రోజూ నమోదవుతున్నాయని అధికారులు చెప్తున్నారు. ఆయా రాష్ట్రాల్లోని విమానాశ్రయాల్లో విదేశీ పర్యాటకులకు పరీక్షలు నిర్వహించగా ఎన్బీ.1.8.1 వేరియంట్ బాధితులను గుర్తిస్తున్నట్టు తెలిపారు. చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్ తదితర దేశాల ప్రయాణికుల్లో ఈ వైరసు గుర్తిస్తున్నామన్నారు. ఒహియో, హవాయి తదితర రాష్ట్రాల్లో స్థానికుల్లోనూ ఈ వైరస్ సోకిందన్నారు. ఈ పరిణామాలపై డ్యూక్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ టోనీ మూడీ స్పందిస్తూ.. 'ఈ స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయంటే వైరస్ మన చుట్టూ వ్యాపించి ఉన్నదని అర్థం. సమీప భవిష్యత్తులో కేసులు మరింత పెరిగే అవకాశం ఉన్నది' అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: అమెరికా మరో కీలక నిర్ణయం! విద్యార్ధి వీసా ఇంటర్వ్యూలకు తాత్కాలికంగా బ్రేక్..!
అమెరికాలో వ్యాక్సినేషన్ తక్కువగా నమోదవడం, ప్రజల్లో రోగనిరోధక శక్తి క్షీణించడం, సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం వంటి కారణాల వల్లే కొవిడ్ విజృంభిస్తున్నదని స్పష్టం చేశారు. దేశంలో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. సోమవారం నాటికి దేశవ్యాప్తంగా 1,010 కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్తున్నారు. అప్రమత్తంగా ఉంటూ సాధారణ నివారణ చర్యలు పాటిస్తే చాలని స్పష్టం చేస్తున్నారు. ప్రధానంగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నప్పటికీ గత వేవ్లతో పోలిస్తే ప్రస్తుతం ఈ ఇన్ఫెక్షన్ సోకినవారి సంఖ్య చాలా తక్కువేనని తెలిపారు. కొవిడ్ బారిన పడినవారిలో వ్యాధి తీవ్రత చాలా తక్కువగా ఉండటంతో అత్యధిక రోగులకు ఓపీడీ (ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్)లోనే సేవలందించి పంపించేస్తున్నామని, కేవలం కొద్ది మందికి మాత్రమే హాస్పిటల్లో చేరాల్సిన అవసరం ఏర్పడుతున్నదని వైద్యులు చెప్తున్నారు. ఎవరికైనా దగ్గు, గొంతు నొప్పి లేదా ఫ్లూ లాంటి లక్షణాలుంటే ఇండ్లకే పరిమితమై వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ఏ రోగికైనా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నదని భావించి వైద్యుడు సూచిస్తే తప్ప మిగతావారు బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. తారక్ ఎమోషనల్ పోస్ట్!
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర..! తులం ఎంతంటే…?
కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?
ఊహించని ధరకు మోటో నుంచి ఎడ్జ్ 60 స్టైలస్.. ఫీచర్లు ఇవే! తమ్ముళ్లు డబ్బు రెడీ చేసుకోండి..
టీడీపీ జెండా.. తెలుగు జాతికి అండ! వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు.. యువగళం పేరుతో..
ఏం అదృష్టం సార్..! అడ్డిమార్ గుడ్డిదెబ్బ కొడితే.. రూ. 231 కోట్ల జాక్ పాట్!
ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!
లోకేశ్‌కు పార్టీలో ఆ పదవి.. జోరుగా చర్చ! జీవీ, ఆనం కీలక వ్యాఖ్యలు!
వల్లభనేని వంశీకి దెబ్బపై దెబ్బ.. బెయిల్ పిటిషన్ కొట్టివేత!
అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి షాక్! 14 రోజుల రిమాండ్..
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ జిల్లా పేరు మారుస్తూ జీవో జారీ!
వైసీపీకి మరో భారీ షాక్! ఏపీ పోలీసుల అదుపులో మాజీ మంత్రి!
కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్! రాష్ట్రానికి మరో 2 లక్షల కనెక్షన్లు!
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జూన్ 2న కీలక ప్రకటనలు! కొత్త ఆరోగ్య పథకం..
ఏపీ పంట పండింది... కొత్తగా 2 రైల్వే లైన్లు! ఆ రూట్లోనే..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #USA #AmericaNews #USAPolice #USAPoliceNewdeathsentence #deathsentence #Nitrogengas #Nitrogengasdeathsentence
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.